KCR: కొత్తపల్లి శివారు రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ స్పందన

  • మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • 14 మంది దుర్మరణం
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

మహబూబ్ నగర్ జిల్లా కొత్తపల్లి శివారు వద్ద ఈ సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మరణించిన ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న ఆయన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టగా, 12 మంది అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

కాగా, మృతుల బంధువులు ఘటనస్థలి వద్ద మృతదేహాలతో ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే తాము మృతదేహాలను అప్పగిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు.

KCR
Mahbubnagar District
Road Accident
  • Loading...

More Telugu News