Jammu And Kashmir: మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి ఏసీబీ నోటీసులు

  • జమ్ము కశ్మీర్ బ్యాంకు ఉద్యోగాల కుంభకోణం కేసు
  • ఈ కేసులో వివరణ నిమిత్తం ఆమెకు నోటీసులు
  • ఇలాంటి నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్న ముఫ్తీ

జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి ఏసీబీ నోటీసులు జారీ అయ్యాయి. జమ్ము కశ్మీర్ బ్యాంకు ఉద్యోగాల కుంభకోణం కేసులో వివరణ నిమిత్తం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ముఫ్తీ ఓ ట్వీట్ చేశారు. అవినీతి నిరోధక శాఖ నుంచి తనకు ఈ నోటీసులు అందడంలో ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. కశ్మీర్ కు చెందిన ప్రధాన నేతలను బెదిరించేందుకు కొందరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని, ఇటువంటి కుట్రలు ఇక్కడ చెల్లవని అన్నారు. 

Jammu And Kashmir
Ex cm
Mehabuba mufthi
ACB
  • Error fetching data: Network response was not ok

More Telugu News