Andhra Pradesh: చంద్రబాబు కార్న్ తింటూ కులాసాగా తిరుగుతుంటే.. ‘ఇస్మార్ట్ నాని’ బెజవాడను దివాళా తీయిస్తున్నాడు!: పీవీపీ సెటైర్లు

  • కేశినేని నానిపై దాడిని తీవ్రతరం చేసిన పీవీపీ
  • వ్యాపారాలు మూసి అందర్ని రోడ్డున పడేశాడని ఆరోపణ
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల వైద్యపరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు రోడ్ల మీద కార్న్ తింటూ కులాసాగా తిరుగుతుంటే, ఆయన సహచరుడు ఇస్మార్ట్ నాని(కేశినేని నాని) వ్యాపారాలు మూసేసి అందరినీ రోడ్డున పడేశాడని ఎద్దేవా చేశారు. కేశినేని నాని బెజవాడను దివాళా తీయించాడని దుయ్యబట్టారు. చంద్రబాబు వెంటనే హెరిటేజ్ పాలు పంపిస్తే, బారులు తీరిన అప్పుల వాళ్లకు ఓ కప్పు కాఫీ ఇస్తామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘చంద్రబాబు గారూ.. తమరు రోడ్లు మీద కార్న్ తింటూ కులాసాగా తిరుగుతున్నారు. ఇక్కడ మీ సహచరుడు శ్రీ. Ismart Nani వ్యాపారాలు మూసేసి అందరిని రోడ్డున పడేసి బెజవాడను దివాలా తీస్తున్నాడు. తమరు దయచేసి,ఆ హెరిటేజ్ పాలు పంపిస్తే, బారులు తీరిన అప్పుల వాళ్లకు,ఓ కప్పు కాఫీ ఇస్తాం’ అని పీవీపీ ట్వీట్ చేశారు. కేశినేని కార్గో వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంటూ కెనరా బ్యాంకు జారీచేసిన స్వాధీనతా ప్రకటనను దీనికి పీవీపీ జత చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Kesineni Nani
pvp
YSRCP
Twitter
  • Loading...

More Telugu News