Crime News: ఐదుగురు కుటుంబ సభ్యులను చంపి, తానూ ఆత్మహత్య
- మరో సభ్యుడికి తీవ్రగాయాలు
- అంతుచిక్కని కారణాలు
- పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న దారుణం
ఓ వ్యక్తి తన కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులపై కాల్పులు జరిపి ఆ తర్వాత తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్ రాష్ట్రం నథువాల్ గ్రామానికి చెందిన సందీప్‌సింగ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాఘపుర ఠానా పోలీసుల కథనం మేరకు కుటుంబ సభ్యులంతా ఓ చోట ఉండగా సందీప్‌సింగ్ తుపాకీతీసి కాల్పులు జరిపాడు. ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన కుటుంబ సభ్యులు తప్పించుకునేలోగానే ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనలో సందీప్‌సింగ్ తల్లిదండ్రులు, సోదరి, తన మూడేళ్ల కుమార్తెతోపాటు నానమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. సింగ్ తాతయ్యకు తీవ్రగాయాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపిన అనంతరం అంతా చనిపోయారనుకుని నిర్థారణకు వచ్చాక సందీప్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సందీప్‌సింగ్ ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాడన్నది తెలియరాలేదు.