vJ siddhartha: నీటిలో మునగడం వల్లే 'కాఫీడే' సిద్ధార్థ మరణం.. పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి

  • ప్రాథమిక సమాచారంలో వెల్లడి
  • సిద్ధార్థ ఊపిరి తిత్తులు బాగా నాని ఉబ్బిపోయాయన్న వైద్యులు
  • తుది నివేదిక కోసం ఎదురుచూపు

‘కేఫ్ కాఫీ డే’ అధినేత వీజే సిద్ధార్థది బలవన్మరణమని తేలింది. పోస్టుమార్టం తుది నివేదిక వివరాలు ఇంకా వెల్లడించనప్పటికీ ఆయన నీటిలో మునగడం వల్లే మరణించినట్టు ప్రాథమిక అంచనాలో వెల్లడైంది. ఈ మేరకు వెన్‌లాక్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ రాజేశ్వరి తెలిపారు. అదృశ్యమైన రోజునే సిద్ధార్థ నదిలో పడి మరణించినట్టు ఇప్పటి వరకు చేసిన పరీక్షల ద్వారా స్పష్టమైనట్టు పేర్కొన్నారు.

 అయితే, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా నదిలో దూకారా? లేక, ఎవరైనా బలవంతంగా ఆయనను నదిలో తోశారా? అన్న విషయం మాత్రం పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. సిద్ధార్థ ఊపిరి తిత్తుల్లోకి నీరు బాగా చేరిందని రాజేశ్వరి తెలిపారు. గంటల తరబడి నీటిలో నానిన తర్వాత ఊపిరి తిత్తులు ఎలా ఉబ్బిపోతాయో.. అలానే ఉన్నాయని పేర్కొన్నారు. దీనిని బట్టి ఆయన నీటిలో మునగడం వల్లే చనిపోయినట్టు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టు తెలిపారు.  

vJ siddhartha
cafe coffee day
suicide
  • Loading...

More Telugu News