West Godavari District: టీచర్లా? కీచకులా?... అత్యాచారం ఎలా చేస్తారో చూపించాలంటూ విద్యార్థులతో డెమో!

  • పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఘటన
  • బాలికకు గాయాలు
  • టీచర్లకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఘోరం అనదగ్గ సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన గురువులే అనుచితంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. చింతలపూడి ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రాజశేఖర్, ఉమామహేశ్వరావు అనే టీచర్లకు వికృతమైన ఆలోచన వచ్చింది. తరగతి గదిలోకి వెళ్లి, అక్కడున్న విద్యార్థులను అత్యాచారం ఎలా చేస్తారో తమ ముందు ప్రదర్శించాలంటూ ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఓ బాలికకు గాయాలయ్యాయి.

ఈ విషయం బయటికి పొక్కడంతో గ్రామస్తులు ఇద్దరు ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళితే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని గ్రహించిన ఆ టీచర్లు గ్రామస్తులకు చెరో రూ.80 వేలు ఇచ్చి రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన డీఈఓ వద్దకు చేరడంతో శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

West Godavari District
Chintalapudi
  • Loading...

More Telugu News