Chandrababu: దేవదాస్ కనకాల తాను రాణించడమే కాకుండా, ఎంతోమందిని ఉత్తమ నటులుగా తీర్చిదిద్దారు: చంద్రబాబు

  • అనారోగ్యంతో కన్నుమూసిన దేవదాస్ కనకాల
  • సంతాపం తెలిపిన చంద్రబాబు
  • ఆయన మరణం కళారంగానికి తీరని లోటు అంటూ ట్వీట్

ప్రముఖ నటుడు, నటనా శిక్షకుడు దేవదాస్ కనకాల మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. దేవదాస్ కనకాల తాను నటుడిగా రాణించడమే కాకుండా, ఎంతోమందిని ఉత్తమ నటులుగా తీర్చిదిద్ది చిత్ర పరిశ్రమకు అందించారని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఆయన మరణం కళారంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో దేవదాస్ కనకాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తన ట్వీట్ లో పేర్కొన్నారు. దేవదాస్ కనకాల అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా, టీడీపీ యువనేత నారా లోకేశ్ కూడా దేవదాస్ కనకాల మృతిపై ట్వీట్ చేశారు. ఎంతోమంది సుశిక్షతులైన నటీనటులను చిత్రపరిశ్రమకు అందించారంటూ కీర్తించారు.

Chandrababu
Telugudesam
Devadas Kanakala
Tollywood
  • Loading...

More Telugu News