polavaram: ‘పోలవరం’ ప్రారంభించింది వైఎస్సార్.. పూర్తి చేయబోతోంది జగన్: వైసీపీ నేత నాగిరెడ్డి

  • నాడు వైఎస్సార్ అన్ని అనుమతులు తెచ్చారు
  • కుడి, ఎడమ కాల్వలను తొంభై శాతం పూర్తి చేశారు
  • బాబు పాలనలో ‘పోలవరం’ను పూర్తి చేయలేకపోయారు

పోలవరం ప్రాజెక్టును నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని, ఆ ప్రాజెక్టును పూర్తి చేయబోతోంది సీఎం జగన్ అని వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కు అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చారని, కుడి, ఎడమ కాల్వలను తొంభై శాతం పూర్తి చేశారని అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై ఆయన విమర్శలు చేశారు. బాబు పాలనలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండానే పూర్తయినట్టుగా చూపించిందని విమర్శించారు. 2018 వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని పదేపదే చెప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఆయన విమర్శలు చేశారు.

polavaram
project
YSR
cm
Ys jagan
  • Loading...

More Telugu News