Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై లోకేశ్ ప్రశంసలు

  • ‘అన్న క్యాంటీన్’లు మూసివేస్తారన్న ఆరోపణలపై నిరసన
  • పేదలకు భోజనాలు ఏర్పాటు చేసిన రామానాయుడు
  • టీడీపీ పేదల పక్షాన నిలుస్తుందని మరోసారి నిరూపించారు

ఏపీలో అత్యంత చవకగా భోజనం అందిస్తున్న‘అన్న క్యాంటీన్’లను ప్రభుత్వం మూసివేస్తోందంటూ ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పేదలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. పేదల ఆకలి తీర్చి నిరసన వ్యక్తం చేసిన రామానాయుడుకి తన అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలిచి, నిబద్ధతతో పోరాడుతుందని మరోసారి నిరూపించారని ఆయన్ని ప్రశంసించారు.

Andhra Pradesh
Anna canteens
mla
Ramanaidu
Telugudesam
Nara Lokesh
YSRCP
Government
  • Error fetching data: Network response was not ok

More Telugu News