Nitin Gadkari: జాతీయగీతాన్ని ఆలపిస్తున్న సమయంలో.. కళ్లుతిరిగి పడిపోయిన నితిన్ గడ్కరీ

  • షోలాపూర్ లో ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ
  • యాంటీబయోటిక్స్ డోస్ ఎక్కువ కావడంతో ఇబ్బంది
  • ఎలాంటి ప్రమాదం లేదన్న డాక్టర్లు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. షోలాపూర్ లోని పుష్యలోక్ అహల్యదేవి హోల్కరీ యూనివర్శిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జాతీయగీతాన్ని ఆలపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కుర్చీలో కూలబడిపోయారు. వెంటనే ఆయనకు ప్రాథమిక పరీక్షలను నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. గొంతు సంబంధిత వ్యాధితో గడ్కరీ బాధపడుతున్నారు. దీంతో ఆయన యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. వాటి డోస్ ఎక్కువ కావడంతో ఇబ్బంది తలెత్తిందని డాక్టర్లు తెలిపారు. గతంలో కూడా ఓ కార్యక్రమంలో గడ్కరీకి ఇలాగే జరిగింది.

Nitin Gadkari
Sholapur
BJP
  • Loading...

More Telugu News