Triple Talak: తలాక్ చెబితే ఇక జైలు శిక్షే... బిల్లుకు ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి

  • చట్ట రూపం దాల్చనున్న ట్రిపుల్ తలాక్ బిల్లు
  • తలాక్ చెబితే ఇకపై మూడేళ్ల జైలు శిక్ష
  • రాజ్యసభలో సునాయాసంగా ఆమోదం పొందిన బిల్లు

పార్లమెంటు ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ట్రిపుల్ తలాక్ బిల్లు ఫైల్ పై ఆయన సంతకం చేశారు. దీంతో, ఈ బిల్లు ఇప్పుడు చట్టరూపం దాల్చబోతోంది. కొత్త చట్ట ప్రకారం భార్యకు తలాక్ చెప్పే భర్తలకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. పెద్దల సభలో కావాల్సినంత మెజార్టీ లేకున్నప్పటికీ మోదీ ప్రభుత్వం విజయవంతంగా బిల్లును ఆమోదింపజేసుకుంది. జేడీయూ, అన్నాడీఎంకే, పలువురు విపక్ష సభ్యులు వాకౌట్ చేయడంతో బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. గత వారమే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదముద్ర వేసింది.

Triple Talak
Bill
President Of India
Ram Nath Kovind
  • Loading...

More Telugu News