Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అవకాశాల గురించి పూజ హెగ్డే 
  • ట్రైన్ సెట్లో మహేశ్ షూటింగ్ 
  • హిందీలోకి చిరంజీవి హిట్ సినిమా 

*  'మన సత్తా బయటకు రావాలంటే అందుకు తగ్గా అవకాశాలు కూడా రావాలి' అంటోంది కథానాయిక పూజ హెగ్డే. 'మనలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, సరైన అవకాశాలు రాకపోతే ఏమీ చేయలేము. మన టాలెంట్ ఎవరికీ తెలియదు. అందుకే, అవకాశం రావడం ఒక ఎత్తు.. అది వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. అప్పుడే మన టాలెంట్ నలుగురికీ తెలుస్తుంది' అని చెప్పింది పూజ.
*  మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ ట్రైన్ సెట్ లో మహేశ్, రష్మిక, ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 10  వరకు ఈ షెడ్యూలు జరుగుతుంది.
*  చిరంజీవి తన 150వ సినిమాగా 'ఖైదీ నెం 150' చిత్రాన్ని చేయగా అది సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా జగన్ శక్తి దర్శకత్వంలో దీనిని అక్కడ రీమేక్ చేయనున్నారు.

Pooja Hegde
Mahesh Babu
Rashmika
Chiranjivi
Akshay Kumar
  • Loading...

More Telugu News