vg siddhartha: కొడుకు ఇక లేడన్న విషయాన్ని తెలుసుకోలేని స్థితిలో 'కాఫీడే' సిద్ధార్థ తండ్రి!

  • కోమాలో ఉన్న సిద్ధార్థ తండ్రి గంగయ్య
  • ఆత్మహత్యకు ముందు ఆసుపత్రికి వెళ్లి తండ్రిని చూసి కన్నీళ్లు
  • గంగయ్య-వసంతి హెగ్డేలకు సిద్ధార్థ ఏకైక కుమారుడు

దేశంలోనే అతిపెద్ద కాఫీ షాప్ చైన్ ‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య దేశవ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తించింది. సిద్ధార్థ మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అయితే, కుమారుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న విషయం ఆయన తండ్రి గంగయ్య (96)కు తెలియకపోవడం విషాదం.  ప్రస్తుతం కోమాలో ఉన్న ఆయన గత రెండు వారాలుగా మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆత్మహత్యకు ముందు ఆసుపత్రికి వెళ్లిన సిద్ధార్థ తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్టు ఆయన బంధువు ఒకరు తెలిపారు. కొన్ని గంటలపాటు తండ్రి పక్కనే ఉన్న సిద్ధార్థ మళ్లీ వస్తానని చెప్పారని, ఆ తర్వాత ఆయన మరణ వార్త తెలిసిందని బంధువులు కన్నీళ్లు పెట్టుకున్నారు. సిద్ధార్థ అంటే గంగయ్యకు ప్రాణమని, అలాంటిది ఆఖరి చూపునకు కూడా నోచుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గంగయ్య-వసంతి హెగ్డే దంపతులకు సిద్ధార్థ ఒక్కగానొక్క కుమారుడు కావడం గమనార్హం.

vg siddhartha
suicide
Gangaiah
netravathi river
cafe coffee day
Karnataka
  • Loading...

More Telugu News