Voter List: రేపటి నుంచి ఓటర్ల వివరాలను పరిశీలించనున్న కేంద్ర ఎన్నికల సంఘం

  • సెప్టెంబర్ 1 నుంచి ఓటర్ల జాబితా తనిఖీ
  • సెప్టెంబర్ 16 నుంచి పోలింగ్ స్టేషన్ల గుర్తింపు
  • అక్టోబర్ 15న ఓటర్ల జాబితా ముసాయిదా
  • 2020 జనవరిలో తుది జాబితా

ఆగస్ట్ 1 నుంచి ఆ నెలాఖరు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించనుంది. ఈ మేరకు ఓటర్ జాబితా సవరణ షెడ్యూల్‌ను సీఈసీ నేడు ప్రకటించింది. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకూ ఓటర్ల జాబితాను తనిఖీ చేయనున్నారు. అనంతరం సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 వరకూ పోలింగ్ స్టేషన్లను గుర్తించనున్నారు.

అక్టోబర్ 15న ఓటర్ల జాబితా ముసాయిదాను ఈసీ విడుదల చేయనుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకూ అభ్యంతరాలు స్వీకరించి, నవంబర్ 2,3 తేదీల్లో ఓటర్ల నమోదు స్పెషల్ క్యాంపెయిన్‌లు నిర్వహించనుంది. డిసెంబర్ 15 కల్లా వినతులను పరిష్కరించనుంది. డిసెంబర్ 31న మార్పులు, కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల పేర్లను చేర్చి.. ఓటరు జాబితాను ముద్రించనున్నారు. 2020 జనవరిలో తుది జాబితాను ఈసీ విడుదల చేయనుంది.

Voter List
CEC
Booth Level
Polling Stations
Special Campaign
  • Loading...

More Telugu News