Chandrababu: టీడీపీ పాలన అద్భుతమని ఒప్పుకున్న జగన్ కు కృతజ్ఞతలు: నారా లోకేశ్

  • బాబు పాలనపై అవినీతి ముద్ర వేసే యత్నం చేశారు
  • ఆరోపణలను నిరూపించలేకపోయారు
  • 14 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో 900 హామీలను అటకెక్కించారు

ఈ అసెంబ్లీ సమావేశాలలో అందరూ తన లాగా అవినీతిపరులేనని ప్రజలను నమ్మించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ఐదేళ్ళ చంద్రబాబు పాలనపై అవినీతి ముద్ర వేసే యత్నం చేశారని, అయితే ఆయన చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయిన జగన్, తమ నోటితోనే టీడీపీ పాలన అద్భుతం అని శాసనసభ సాక్షిగా ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు.

పోలవరంలో అవినీతి అంటూనే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అంచనాలనే కేంద్రం ఆమోదించిందని అన్నారని, చంద్రబాబు పాలనలో 5 లక్షల 60 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆధారాలతో సహా అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారని, తమ పాలన బాగుందని ఒప్పుకున్నందుకు జగన్ కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

పాదయాత్రలో ముందుకి నడిచిన జగన్, అధికారంలోకి వచ్చాక వెనక్కి నడుస్తున్నారని విమర్శించారు. ఆ విషయం ఈ అసెంబ్లీ సమావేశాలలో స్పష్టమైందని, 14 నెలల పాదయాత్రలో 900 హామీలు ఇచ్చారని, 14 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో 900 హామీలను అటకెక్కించారని విమర్శిస్తూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.

  • Loading...

More Telugu News