Q-net: ‘క్యూనెట్’ మోసం.. మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

  • గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పని చేస్తున్న అరవింద్
  • క్యూనెట్ సంస్థలో రూ.20 లక్షలు పెట్టుబడి
  • ఆ డబ్బు తిరిగిరాదన్న మనస్తాపంతో ఆత్మహత్య

క్యూనెట్ సంస్థలో పెట్టుబడి పెట్టి మోసపోయిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాదాపూర్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో అరవింద్ పని చేస్తున్నాడు. స్థానిక చంద్రానాయక్ తండాలో నివసిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం క్యూనెట్ సంస్థలో రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా ఫలితం దక్కకపోవడంతో, మనస్తాపం చెందిన అరవింద్, నిన్న రాత్రి మాదాపూర్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అరవింద్ మృతి వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం.

Q-net
Madapur
Software
Employe
suicide
  • Loading...

More Telugu News