Coffee Day: కాఫీ డే తాత్కాలిక ఛైర్మన్ గా నియమితులైన ఎస్వీ రంగనాథ్

  • ఇంత కాలం నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్న రంగనాథ్
  • సీఓఓగా నితిన్ బగ్మనే నియామకం
  • బోర్డ్ డైరెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు

కాఫీ డే సంస్థ అధినేత వీజీ సిద్ధార్థ్ మరణించిన దరిమిలా ఆయన స్థానంలో తాత్కాలిక ఛైర్మన్ గా ఎస్వీ రంగనాథ్ బాధ్యతలను చేపట్టారు. బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈరోజు బోర్డ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రంగనాథ్ కు బాధ్యతలను అప్పగిస్తూ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి సమావేశం ఆగస్ట్ 8న ఉంటుందని డైరెక్టర్లు తెలిపారు. మరోవైపు నితిన్ బగ్మనే తాత్కాలిక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. రంగనాథ్ ఇంత కాలం కాఫీ డే సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా విధులను నిర్వహించారు.

Coffee Day
Chairmen
SV Ranganath
  • Loading...

More Telugu News