Nimmagadda: నిమ్మగడ్డతో ఉన్న వ్యాపార లావాదేవీలను జగన్ బయటపెట్టాలి: యనమల

  • సీబీఐ విచారణ జరుగుతుండగా ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఎలా విడుదల చేస్తారు?
  • వాన్ పిక్ కుంభకోణంలో వాస్తవాలను బయటపెట్టాలి
  • అవినీతి కేసులలో జగన్ పేరు మారుమోగుతోంది

పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ పై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఓ వైపు సీబీఐ విచారణ జరుగుతుండగానే ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఎలా విడుదల చేస్తారని ఆయన ప్రశ్నించారు. వాన్ పిక్ కుంభకోణంలో వాస్తవాలను ప్రజలకు వివరించాలని... నిమ్మగడ్డతో తనకున్న వ్యాపార లావాదేవీలను జగన్ బహిర్గతం చేయాలని అన్నారు. సెర్బియాలో అరెస్టైన నిమ్మగడ్డను విడిపించాలని వైసీపీ ఎంపీలు కోరడం... ఆయనతో జగన్ కు ఉన్న వ్యాపార బంధానికి ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు. అవినీతి కేసులలో జగన్ పేరు అంతర్జాతీయంగా మారుమోగుతోందని అన్నారు. ఏపీ ప్రజలు మిమ్మల్ని గెలిపించింది రాష్ట్ర ప్రయోజనాల కోసమా? లేక నిందితుల ప్రయోజనాల కోసమా? అని ప్రశ్నించారు. 

Nimmagadda
Jagan
Yanamala
VANPIC
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News