Dinchak Pooja: చెత్తగా పాడి, పిచ్చి స్టెప్పులేసినా... డించక్ పూజా నయా సెన్సేషన్... వీడియో!

  • కొత్త పాటను యూట్యూబ్ లో ఉంచిన పూజా
  • విచిత్రమైన స్టెప్పులు, కర్ణకటోరమైన గొంతు
  • అయినా వ్యూస్ మాత్రం లక్షల్లోనే

డించక్ పూజా... తన వినూత్న నృత్యాలు, పాటలతో తయారు చేసిన వీడియోలను యూ ట్యూబ్ లో ఉంచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈసారి మాత్రం ఆమె ఓ వెరైటీ వీడియోను తయారు చేయగా, దానికి 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. "పాగల్‌ హోకే నాచో... ఔర్‌ నాచ్‌ కే పాగల్‌ హో జావో"  (పిచ్చివాళ్లలా నృత్యం చేయండి.. నృత్యం చేస్తూ పిచ్చోళ్లు అవ్వండి) అనే అర్థం వచ్చేలా ఉన్న పాటను, చెత్తగా పాడుతూ, పిచ్చి స్టెప్పులేస్తూ పూజా షూట్ చేసింది.

కర్ణకటోరమైన గొంతు, శ్రుతి, లయలు లేకుండా పాట, విచిత్రమైన స్టెప్పులతో ఉన్న ఈ వీడియోను చూస్తూనే, పూజాను నానా తిట్లూ తిడుతున్నారు. ఇది టెర్రరిస్ట్ చర్యేనని అంటున్నారు. ఆమె ఓ కొత్త ఆయుధాన్ని తెచ్చిందని, పాటపై రిపోర్ట్ చేసే అవకాశాన్ని ఇవ్వాలని యూట్యూబ్ ను కోరుతున్నారు. విమర్శలు ఎన్ని ఉన్నా వ్యూస్ మాత్రం లక్షల్లోనే వస్తున్నాయి. ఇక ఈ వీడియో ఎందుకు నెట్టింటిని ఆగమాగం చేస్తున్నదో తెలియాలంటే, మీరూ వీడియోను చూడండి.

Dinchak Pooja
Youtube
Video
Song
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News