Coffe Day: కాఫీడే సిద్ధార్థ్ ను గతంలో నేను కలిశా.. ఆయన ఒక జెంటిల్మెన్: కేటీఆర్

  • నదిలో లభ్యమైన సిద్ధార్థ్ మృతదేహం 
  • షాక్ కు గురయ్యానన్న కేటీఆర్
  • కొన్నేళ్ల క్రితం ఆయనను కలిశానని ట్వీట్

ఆదాయపు పన్ను విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి వేధింపులతో విసిగిపోయానంటూ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మరణం పట్ల రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. 'వీవీ సిద్ధార్థ్ ఆత్మహత్యకు పాల్పడిన వార్తతో షాక్ కు గురయ్యాను. ఎంతో బాధగా ఉంది. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం కలిగింది. ఆయన ఒక జెంటిల్మెన్, సౌమ్యుడు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, కాఫీ డే సిబ్బంది నిబ్బరంగా ఉండాలి' అని ట్వీట్ చేశారు.

Coffe Day
Siddhartha
KTR
TRS
  • Loading...

More Telugu News