New Delhi: ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ లో జంట ప్రేమకలాపాలు... పోర్న్ సైట్లలో ప్రత్యక్షం!

  • స్టేషన్ సీసీటీవీల్లో అసభ్య దృశ్యాలు
  • పోలీసు కేసు పెట్టిన అధికారులు
  • ఇంతలోనే నెట్టింట వీడియోలు

న్యూఢిల్లీలోని ఓ మెట్రో రైల్వే స్టేషన్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన యువజంట కామ కలాపాలు పోర్న్ సైట్లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై మెట్రో కార్యనిర్వాహక డైరెక్టర్ అనుజ్ దయాళ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే, రైల్వే స్టేషన్ లో ఓ జంట అసభ్య కార్యకలాపాలకు పాల్పడగా, వారిపై అజాద్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మెట్రో అధికారులు తమ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఇతర వివరాలను పోలీసులకు అప్పగించారు.

ఈ క్రమంలో రైల్వే కంట్రోల్ రూమ్ లో ఉండాల్సిన సదరు ఫుటేజ్ ఇప్పుడు పోర్న్ సైట్లలోకి ఎక్కింది. దీన్ని చూసిన పలువురు మెట్రో అధికారులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లను పోర్న్ సైట్లలోకి ఎక్కించడం ఏంటని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కాగా, మెట్రో రైల్ సిబ్బందిలో ఎవరో ఒకరు ఈ వీడియోలను దొంగిలించి, నెట్టింట పెట్టి ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నాయని, అతను ఎవరో గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని అనుజ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో యువత ఈ తరహా పనులకు పాల్పడరాదని ఆయన హితవు పలికారు.

New Delhi
Crime News
Metro
Couple
Lovers
Porn Sites
  • Loading...

More Telugu News