Hasan Ali: భారత్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న పాకిస్థాన్ క్రికెటర్

  • ఓ ఇంటివాడు కాబోతున్న పాక్ పేస్ బౌలర్ హసన్ అలీ
  • హర్యానాకు చెందిన షమియా అర్జూతో అలీ పెళ్లి
  • ఆగస్టు 20న దుబాయ్ లో వివాహం!

పాకిస్థాన్ క్రికెటర్లు భారత అమ్మాయిలను పెళ్లాడడం ఇప్పటిదికాదు. నాటి పాకిస్థానీ క్రికెట్ దిగ్గజం జహీర్ అబ్బాస్, ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ కూడా భారతీయ యువతులనే పెళ్లాడారు. షోయబ్ మాలిక్ హైదరాబాదీ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవలో పాకిస్థాన్ పేస్ బౌలర్ హసన్ అలీ కూడా చేరుతున్నాడు. హసన్ అలీ వివాహం హర్యానాకు చెందిన షమియా అర్జూతో ఆగస్టు 20న జరగనుంది. ఈ పెళ్లి దుబాయ్ లో జరగనున్నట్టు సమాచారం.

హసన్ అలీ వయసు 25 ఏళ్లు. దుబాయ్ లో ఓ సన్నిహితుడి ద్వారా షమియాతో హసన్ అలీకి పరిచయం ఏర్పడింది. ఇంగ్లాండ్ లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివిన షమియా గతంలో దుబాయ్ కేంద్రంగా జెట్ ఎయిర్ వేస్ లో పనిచేసింది. ఇక, హసన్ అలీ విషయానికొస్తే 2017 చాంపియన్స్ ట్రోఫీలో పాక్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

Hasan Ali
Pakistan
India
  • Loading...

More Telugu News