Vijay Devarakonda: 'డియర్ కామ్రేడ్'కి యాడ్ చేసిన క్యాంటీన్ సాంగ్

  • ఈ నెల 26న వచ్చిన 'డియర్ కామ్రేడ్'
  • కథాకథనాలు నెమ్మదించాయనే టాక్
  •  ట్రిమ్ చేసిన సినిమా టీమ్

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో ఈ నెల 26వ తేదీన 'డియర్ కామ్రేడ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కథను సాగదీసిన అభిప్రాయాన్నే అంతా వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేదని చెప్పారు. అన్నిచోట్లా ఇదే విధమైన రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమా టీమ్ కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేసినట్టుగా సమాచారం.

అంతే కాకుండా నిడివి ఎక్కువైందనే ఉద్దేశంతో అంతకుముందు పక్కన పెట్టేసిన క్యాంటీన్ సాంగ్ ను కలిపినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన మరో పాట కలపడం సినిమాకి కలిసొస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.  

  • Loading...

More Telugu News