Baba Bhaskar: రజనీకాంత్ గారు గోల్డ్ చైన్ గిఫ్ట్ గా ఇచ్చారు: బాబా భాస్కర్

  • రజనీ సార్ సినిమాకి పనిచేశాను 
  • నా పనితీరును రజనీ మెచ్చుకున్నారు
  •  అది నా జీవితంలో మరిచిపోలేని రోజు

మనసులో ఏమీ దాచుకోకుండా ఉన్నది వున్నట్టుగా మాట్లాడుతూ, ఇటీవల కాలంలో బాబా భాస్కర్ చాలామంది మనసులను గెలుచుకున్నాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో బాబా భాస్కర్ మాట్లాడుతూ .. " ఒకసారి రజనీకాంత్ గారి సినిమాకు పని చేశాను. ఆ మరుసటి రోజు రజనీకాంత్ గారి మేనేజర్ నాకు కాల్ చేశారు.

'రజనీ సార్ ఇంటికి రమ్మంటున్నారు' అని చెప్పడంతో ఆనందంతో పొంగిపొయాను. డాన్స్ మాస్టర్ గా మరో ఛాన్స్ ఇప్పిస్తారేమోననే సంతోషంతో వెళ్లాను. రజనీ సార్ నన్ను చాలా ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందురోజు చేసిన నా వర్క్ ను గురించి ప్రస్తావిస్తూ, నా పనితీరు నచ్చిందంటూ ఓ గోల్డ్ చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ సంఘటనను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను"అని ఆయన చెప్పుకొచ్చారు.

Baba Bhaskar
Ali
  • Loading...

More Telugu News