Prabhas: 'సాహో నుంచి సాంగ్ టీజర్ రిలీజ్

  • సుజిత్ నుంచి రానున్న 'సాహో' 
  • ఆగష్టు 2న పూర్తి సాంగ్ రిలీజ్
  •  ఆగస్టు 30న సినిమా విడుదల  

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' రూపొందింది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. "నిన్నను మరిచేలా నిను ప్రేమిస్తాలే .. నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే' అనే సాంగ్ బిట్ ను వదిలారు.

 ప్రభాస్ - శ్రద్ధా కపూర్ కాంబినేషన్లో విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ సాంగులో ప్రభాస్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా .. శ్రద్ధా కపూర్ కూడా మరింత గ్లామరస్ గా కనువిందు చేస్తోంది. ఆగస్టు 2వ తేదీన పూర్తి సాంగును విడుదల చేయనున్నారు. ఈ మెలోడియస్ గీతానికి మంచి మార్కులే పడతాయనిపిస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News