Dear Comrade: 'డియర్ కామ్రేడ్'లో అరగంట నిడివి కట్... కొత్తగా పాటకు చోటు

  • కొన్ని సీన్లు అవసరంలేదని భావించిన చిత్రబృందం
  • క్యాంటీన్ సాంగ్ ను తాజాగా జోడించిన వైనం
  • నేటి నుంచి కొత్త పాటతో డియర్ కామ్రేడ్ ప్రదర్శనలు

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వచ్చిన చిత్రం డియర్ కామ్రేడ్. ఇటీవలే రిలీజైన ఈ సినిమాకు మంచి స్పందనే వస్తోంది. అయితే కొన్ని సీన్లు సాగదీసినట్టుగా ఉన్నాయంటూ రివ్యూలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టెంపోను దెబ్బతీస్తున్నాయని భావించిన కొన్ని సీన్లకు కత్తెర వేశారు. దాదాపు 30 నిమిషాల ఆట రీఎడిటింగ్ లో తొలగించామని, కొత్తగా ఓ పాటను జోడించామని చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని వెల్లడించారు. రీఎడిట్ వెర్షన్ ఇవాళ్టి నుంచి ప్రదర్శితమవుతుందని తెలిపారు. క్యాంటీన్ సాంగ్ బాగా ప్రజాదరణ పొందినా మొదట్లో సినిమా లెంగ్త్ ను దృష్టిలో పెట్టుకుని దాన్ని జోడించలేకపోయామని, ఇప్పుడు కొన్ని సీన్లను తొలగించిన నేపథ్యంలో ఆ పాటను కూడా కలిపామని వివరించారు.

Dear Comrade
Vijay Devarakonda
Rashmika Mandanna
  • Loading...

More Telugu News