ISRO: చంద్రయాన్-2లో మరో కీలక ఘట్టాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు
- ఈ నెల 22న చంద్రయాన్-2 ప్రయోగం
- కక్ష్యను విజయవంతంగా పెంచిన ఇస్రో
- మరికొన్ని రోజుల్లో చంద్రుడ్ని చేరుకోనున్న చంద్రయాన్-2
వారం రోజుల క్రితం శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్-2 నింగికెగిసిన సంగతి తెలిసిందే. ఇది సెప్టెంబరు 7న చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి మరింత సమీపానికి చేరుకుంది. ఈ మేరకు చంద్రయాన్-2 కక్ష్యను విజయవంతంగా పెంచారు. ఈ మధ్యాహ్నం ఇస్రో శాస్త్రవేత్తలు వాహకనౌకలోని ఆన్ బోర్డ్ ప్రొపల్షన్ వ్యవస్థలో ఉన్న ఇంధనాన్ని మండించడం ద్వారా ఇది సాధ్యమైంది. చంద్రయాన్-2 కక్ష్య పెంపు ప్రక్రియ నిర్వహించడం ఇది మూడోసారి. తద్వారా చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి మరింత సమీపానికి చేరుకోగలుగుతుంది.