: రైతుల రుణమాఫీకే తొలి ప్రాధాన్యం: చంద్రబాబు
రైతులకు రుణమాఫీ సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడం ఆయన చేతగానితనమని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇది ఆయన పూర్తి అసమర్ధతకు నిదర్శనమన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ దస్త్రం పైనే తొలి సంతకం చేస్తామనీ, దానికే మొదటి ప్రాధాన్యం ఇస్తామని బాబు హామీ ఇచ్చారు.
గుంటూరు జిల్లా ఏడవ రోజు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా, పెదకాకాని మండలం ఉప్పలపాడులో చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిన వైనాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తి చూపిందని ఆయన గుర్తు చేశారు.