Venkaiah Naidu: అయాం సారీ, జైపాల్ తో అనుబంధం గుర్తుకొచ్చి తట్టుకోలేకపోయాను: రాజ్యసభలో కంటతడి పెట్టిన వెంకయ్య

  • పెద్దల సభలో జైపాల్ రెడ్డికి నివాళులు
  • భావోద్వేగాలు భరించలేకపోయిన వెంకయ్యనాయుడు
  • జైపాల్ తో అనుబంధాన్ని సభకు వివరించిన వైనం

రాజ్యసభలో ఈ ఉదయం విషాదభరిత వాతావరణం కనిపించింది. హైదరాబాద్ లో అనారోగ్యం కారణంగా మరణించిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించే క్రమంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు భావోద్వేగాలు తట్టుకోలేక విలపించారు. తన కారణంగా సభ మూగబోవడంతో, "అయాం సారీ, జైపాల్ రెడ్డితో నా అనుబంధానికి 40 ఏళ్లు. ఆయనతో స్నేహబంధం గుర్తొచ్చి తమాయించుకోలేకపోయాను" అంటూ వెంకయ్యనాయుడు కాసేపు కర్చీఫ్ తో కన్నీళ్లు తుడుచుకుంటూ మౌనంగా ఉండిపోయారు.

జైపాల్ రెడ్డి ఇకలేరన్న సమాచారం తెలిసి భరించలేకపోయానని బాధను వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ సెషన్లలో ఆయనతో కలిసి రెండు పర్యాయాలు పనిచేసే భాగ్యం దక్కిందని చెప్పారు. ఆయన తనకు మిత్రుడే కాకుండా, రాజకీయ రంగంలో సీనియర్ అని, తనకు అన్ని విషయాలు వివరించేవారని తెలిపారు. జైపాల్ కున్న విషయపరిజ్ఞానం అపారం అని కొనియాడారు.

Venkaiah Naidu
Rajya Sabha
Jaipal Reddy
Congress
  • Error fetching data: Network response was not ok

More Telugu News