Hyderabad: చిక్కడపల్లిలో వ్యాపారి కిడ్నాప్‌... కోటి తీసుకుని విడుదల

  • మూడు కోట్లు డిమాండ్ చేసిన  దుండగులు
  • ఆర్థిక లావాదేవీలే కారణమన్న ఆరోపణ
  • బాధితునికి ముంబయి వర్గాలతో వ్యాపార సంబంధాలు

హైదరాబాద్‌ నగరంలోని చిక్కడపల్లికి చెందిన ఓ వ్యాపారి కిడ్నాప్‌ కొన్ని గంటలపాటు కలకలానికి కారణమయ్యింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని దుండగులు సోమవారం ఉదయానికి వదిలేయడంతో కథ సుఖాంతమయ్యింది. మూడు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసిన దుండగులు కోటి రూపాయలు తీసుకుని వదిలేశారని బాధితుని కథనం.

పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...చిక్కడపల్లికి చెందిన గజేంద్రప్రసాద్‌ ఆటో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి ముంబయికి చెందిన కొన్ని వర్గాలతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాల విషయంలో ఇరువర్గాల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గజేంద్రప్రసాద్‌ను కిడ్నాప్‌ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారు. సంప్రదింపుల అనంతరం దుండగులు కోటి రూపాయలు తీసుకుని ఈరోజు ఉదయం అబిడ్స్‌లో ఆయనను విడిచిపెట్టారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Hyderabad
chikkadapalli
man kidnaped
3 crores demand
  • Loading...

More Telugu News