Karnataka: కర్ణాటకలో యడ్డీ బల పరీక్షకు ముందు కీలక పరిణామం... స్పీకర్ రాజీనామా!

  • నేడు యడియూరప్ప బలపరీక్ష
  • నిన్న రెబల్స్ పై వేటు వేసిన స్పీకర్
  • తన బాధ్యత పూర్తయిందని భావిస్తున్న రమేశ్ కుమార్

మరికొన్ని గంటల్లో కర్ణాటక నూతన సీఎం యడియూరప్ప విశ్వాస పరీక్షను ఎదుర్కోనుండగా, స్పీకర్ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేడు రిజైన్ చేయాలన్న నిర్ణయంతోనే ఆయన నిన్న 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి గద్దె దిగేందుకు కారణమైన వారిపై కఠినంగా వ్యవహరించడంతో తన బాధ్యత పూర్తయిందని భావించిన రమేశ్ కుమార్, తనంతట తానుగా కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, యడియూరప్ప బల పరీక్షకు ఈ నెలాఖరు వరకూ గవర్నర్ సమయం ఇచ్చినప్పటికీ, నేడే విశ్వాస పరీక్షను ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

Karnataka
Yedeyurappa
Ramesh Kumar
Resign
  • Loading...

More Telugu News