Mukesh Goud: నాన్న పరిస్థితి అసలు బాగాలేదు: ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కన్నీరు

  • నిన్న అపోలోలో చేరిన ముఖేశ్ గౌడ్
  • ఐసీయూలో డాక్టర్ల చికిత్స
  • ట్రీట్ మెంట్ కొనసాగుతోందన్న విక్రమ్

తీవ్రమైన అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఎంతమాత్రమూ బాగాలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కన్నీటిపర్యంతమయ్యారు. నిన్న సాయంత్రం ఆయన అస్వస్థతకు గురికావడంతో, జూబ్లీహిల్స్‌ లోని అపోలో ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి, వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు.

తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన విక్రమ్ గౌడ్, తన తండ్రికి డాక్టర్ల ట్రీట్ మెంట్ కొనసాగుతోందని తెలిపారు. కాగా, ముఖేశ్ గౌడ్ శరీరంలోని పలు అవయవాలు చికిత్సకు స్పందించడం లేదని తెలుస్తోంది. తమ నాయకుడు ముఖేశ్ పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నాయి.

Mukesh Goud
Vikram Goud
Apollo
Health
  • Loading...

More Telugu News