Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • శ్రుతి హాసన్ సొంత నిర్ణయాలు
  • నితిన్ 'భీష్మ' తొలి షెడ్యూలు పూర్తి 
  • తమిళంలోకి తెలుగు హిట్ చిత్రం
  • చిరంజీవితో దిల్ రాజు ప్రాజక్ట్

*  తాను ఏ విషయంలోనూ ఎవరినీ సలహాలు అడగనని చెబుతోంది కథానాయిక శ్రుతి హాసన్. 'చిన్నప్పటి నుంచీ మా తల్లిదండ్రులు మమ్మల్ని అలా పెంచారు. ఎవరిపైనా ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకునేలా తర్ఫీదు ఇచ్చారు. దాంతో ఎటువంటి విషయంలోనైనా సరే నేనే నిర్ణయం తీసుకుంటాను. అందుకే ఇంతవరకు ఎవరినీ సలహా అడగవలసిన అవసరం రాలేదు' అని చెప్పింది శ్రుతి.
*  నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న 'భీష్మ' చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ ముగిసింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలి షెడ్యూల్ వచ్చే నెల 16 నుంచి జరుగుతుంది. ఇందులో హెబ్బా పటేల్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది.
*  ఆరేళ్ల క్రితం వెంకటేశ్, మహేశ్ బాబు కలసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' హిట్ చిత్రం ఇప్పుడు తమిళంలోకి డబ్ అయింది. 'నెంజామెల్లాం పలవాన్నమ్' పేరిట అనువాదమైన ఈ చిత్రం రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తారు.
*  పలువురు అగ్రతారలతో చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో చిరంజీవితో కూడా ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయమై ఇటీవల చిరంజీవి, రాజు కలసి చర్చించడం జరిగిందని తెలుస్తోంది.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News