Telangana: రేపటి నుంచి పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఉపరితల ఆవర్తనం.. అల్ప పీడనంగా మారే అవకాశం
- తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
- కోస్తాంధ్ర, రాయలసీమలకూ వర్ష సూచన
రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని, పలు చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి పలు చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది.
మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 7.6 కి.మీ. ఎత్తు వరకు వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఇంకా ఎత్తుకు వెళ్లే కొద్దీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలుగు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.