Ray Philips: ప్లేటులో వేసిన చికెన్ ముక్కల్లో ఒకటి ఎగిరి కింద పడింది.. వీడియో వైరల్.. 19 మిలియన్ల వ్యూస్‌!

  • ముక్కలు కదులుతుండటాన్ని గమనించిన ఫిలిప్స్
  • వీడియో తీస్తుండగా ఒక ముక్క ఎగిరి కిందపడింది
  • ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో.. 2 లక్షల షేర్లు

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వింత సంఘటన జరిగింది. మార్కెట్ నుంచి చికెన్ తీసుకొచ్చి ప్లేటులో వేయగా, కాసేపటికి అందులోని ముక్కలు కదులుతుండటాన్ని చూసి వెంటనే వీడియో తీశాడు. ఆ ముక్క ఎగురుతూ వెళ్లి కింద పడటం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా, దానిని 19 మిలియన్ల మంది వీక్షించారు. రే ఫిలిప్స్ అనే వ్యక్తి తన రెస్టారెంట్‌లో చికెన్ వండేందుకు మార్కెట్ నుంచి తీసుకొచ్చి టేబుల్‌పై నున్న ప్లేటులో వేశారు.

కాసేపటికి ముక్కలు కదులుతుండటాన్ని గమనించిన ఫిలిప్స్ వెంటనే వీడియో తీయడం ఆరంభించాడు. వాటిలో ఒక ముక్క ఎగిరి కింద పడటం ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే దీనిని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది. దీనికి 19 మిలియన్ల వ్యూస్ రాగా, రెండు లక్షల మంది షేర్ చేయడం విశేషం. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.  

Ray Philips
America
Florida
Chicken
Video viral
Facebook
  • Loading...

More Telugu News