kobbarimatta: ‘కొబ్బరిమట్ట’లో మూడు నిమిషాలకు పైగా సంపూ చెప్పిన భారీ డైలాగ్ విడుదల

  • ‘కొబ్బరిమట్ట’లో సంపూ త్రిపాత్రాభినయం 
  • ఆండ్రాయిడ్ పాత్రలో సంపూ చెప్పిన భారీ డైలాగ్
  • ‘ఏరా పెద్దరాయుడు.. ఓరీ, ఓరోరి.’ అంటూ సాగిన డైలాగ్

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటించిన ‘కొబ్బరిమట్ట’ చిత్రంలో మూడు నిమిషాల 27 సెకన్ల పాటు ఓ డైలాగ్ ను సంపూ చెప్పాడు. కొద్ది సేపటి క్రితం ఈ డైలాగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇంత పెద్ద డైలాగ్ ను సింగిల్ టేక్ లో, సింగిల్ షాట్ లో ఇంత వరకూ ఎవరూ చెప్పలేదని, ఇది ప్రపంచ రికార్డుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ‘ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలూ కళ్లుగా మారాలో, వాడు రాబోతున్నాడు’ అంటూ ఈ వీడియో ప్రారంభమైంది. ‘ఏరా పెద్దరాయుడు.. ఓరీ, ఓరోరి..’అంటూ ‘ఆండ్రాయిడ్’ పాత్రలో నటించిన సంపూ ఏకధాటిగా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

ఈ డైలాగ్ నేర్చుకోవడానికి తాను పదిరోజులు కష్టపడ్డానని, ఈరోజు ఆ కష్టాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నా’ అని చెప్పాడు. ‘హృదయకాలేయం’ అనే చిన్న సినిమాతో తనను ఆశీర్వదించి, ఆదరించిన ప్రేక్షకులందరూ, ఆగస్టు 10న కొబ్బరిమట్ట సినిమాను ఆదరించాలని, ఆశీర్వదించాలని ఈ డైలాగ్ విడుదలకు ముందు ఓ వీడియోలో సంపూర్ణేశ్ బాబు కోరాడు.

kobbarimatta
sampoorneshbabu
Dialogue
  • Error fetching data: Network response was not ok

More Telugu News