Bonalu: బోనమెత్తిన సెలబ్రిటీలు... పాతబస్తీలో భక్తుల జాతర

  • తెలంగాణలో బోనాల సీజన్
  • సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న పీవీ సింధు, విజయశాంతి
  • భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించిన పూనమ్ కౌర్

ప్రస్తుతం తెలంగాణలో బోనాల సీజన్ నడుస్తోంది. సామాన్యులు, ప్రముఖులన్న తేడా లేకుండా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. తాజాగా, ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. కాంగ్రెస్ నేత విజయశాంతి, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, సినీ నటి పూనమ్ కౌర్ కూడా బోనాలు సమర్పించారు. పీవీ సింధు ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ఉంటే మరింత మెరుగ్గా ఆడతానని తెలిపింది. అమ్మవారికి బోనాలు సమర్పించడం పట్ల సింధు హర్షం వ్యక్తం చేసింది.

ఇక, సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు సమర్పించిన అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ చార్మినార్ ప్రాంతంలో ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో బోనాలు సమర్పించింది.

Bonalu
Telangana
Hyderabad
  • Loading...

More Telugu News