Odisha: ఛత్తీస్ గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్... మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-f6de8cd9872289e9eb41e106320254f592f4f7f6.jpeg)
- బస్తర్ జిల్లా జగదల్ పూర్ లో తుపాకుల మోత
- ఏడుగురు మావోల మృతి
- ఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం
ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లా జగదల్ పూర్ తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరణించినవారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కాగా, ఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కొన్నిరోజులుగా ఇక్కడి అటవీప్రాంతంలో మావోయిస్టు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించిన భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించినట్టు తెలుస్తోంది.