Rohit Sharma: కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలకు కారణం 'రాయుడు'..?

  • రాయుడి ఎంపిక కోసం పట్టుబట్టిన రోహిత్ శర్మ!
  • విజయ్ శంకర్ కావాలన్న కోహ్లీ
  • ధోనీని ఏడోస్థానంలో పంపడాన్ని వ్యతిరేకించిన రోహిత్ శర్మ!

ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ సెమీస్ ఓటమి తర్వాత భారత జట్టుకు విమాన టికెట్లు దొరక్కపోవడంతో ఓ వారం రోజులపాటు ఆటగాళ్లు అక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం టీమ్ తో పనిలేకుండా అందరికంటే ముందే భారత్ చేరుకున్నాడు. దాంతో కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య వ్యవహారం చెడిందని కథనాలు వచ్చాయి. దానికితోడు కోహ్లీ, అనుష్క శర్మలను సోషల్ మీడియాలో రోహిత్ అన్ ఫాలో చేయడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

అయితే, ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య భేదాభిప్రాయాలకు కారణం అంబటి రాయుడు అని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. వరల్డ్ కప్ కు రాయుడ్ని ఎంపిక చేయాలంటూ రోహిత్ పట్టుబట్టగా, అసలే ఫార్మాట్ లోనూ తనను తాను నిరూపించుకోని విజయ్ శంకర్ కోసం కోహ్లీ పట్టుదల ప్రదర్శించినట్టు తెలుస్తోంది. జట్టు వ్యూహాల్లో కూడా కోహ్లీ, రవిశాస్త్రి తనను పట్టించుకోవడం లేదని రోహిత్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా, న్యూజిలాండ్ తో సెమీఫైనల్లో ధోనీని ఏడో స్థానంలో పంపడం రోహిత్ ను ఆగ్రహానికి గురిచేసిందని ప్రచారం జరుగుతోంది.

Rohit Sharma
Virat Kohli
Team India
Ambati Rayudu
  • Loading...

More Telugu News