Kurnool: వైసీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

  • సీఎం జగన్ పై టీడీపీ నేత కోట్ల విమర్శలు
  • వైసీపీ గెలుపునకు కారణం ప్రధాని మోదీయే
  • వైసీపీ కార్యకర్తల దాడులతో అధైర్యపడొద్దు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి విమర్శలు చేశారు. కర్నూలులో ఈరోజు నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కారణం ప్రధాని మోదీయే అని, అందుకే, జగన్ విజయం సాధించారని అన్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని దేశ వ్యాప్తంగా ప్రచారంలో ఉందని, మోసాలతో గెలిచిన పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడుల గురించి ప్రస్తావించారు. ఈ దాడులతో టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు. వైసీపీ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. పిచ్చోడి చేతిలో రాయిలా వైసీపీ పాలన ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Kurnool
Telugudesam
Kotla
suryaprakash reddy
jagan
  • Loading...

More Telugu News