Balakrishna: బాలకృష్ణ 'రూలర్' లో భూమిక

  • బాలకృష్ణ నెక్స్ట్ మూవీగా 'రూలర్'
  • వచ్చేనెల 7వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్
  •  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో భూమిక    

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకున్న ఈ సినిమా, వచ్చేనెల 7వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. బ్యాంకాక్ లో ఫస్టు షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.

బాలకృష్ణ ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా సోనాల్ చౌహాన్ ను .. వేదికను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం భూమికను కూడా తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకం కానుందని చెబుతున్నారు. బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భూమిక పాత్ర కనిపిస్తుందని అంటున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News