Vijayawada: విజయవాడ నగరవాసులకు మెరుగైన సేవలు అందిస్తాం: సీపీ ద్వారకా తిరుమలరావు

  • మెరుగైన సేవలు అందించడంపై సమీక్షించాం
  • స్పందన కార్యక్రమంపై విస్తృతంగా చర్చించాం
  • ఇప్పటి వరకు 4 వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి

విజయవాడ నగరవాసులకు మెరుగైన సేవలు అందిస్తామని సిటీ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. విజయవాడ కమిషనరేట్ లో అర్ధ వార్షిక సమీక్ష నిర్వహించారు. నగరవాసులకు మెరుగైన సేవలు అందించడంపై సమీక్షించామని, ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ, జైళ్లు, రోడ్లు, భవనాల శాఖ వంటి పలు శాఖలతో సమీక్షించామని చెప్పారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్పందన కార్యక్రమంపై విస్తృతంగా చర్చించామని అన్నారు. సమస్యల పరిష్కారం దిశగా అన్ని శాఖల అధికారులు చర్చించారని, ఇప్పటి వరకు నాలుగు వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఈ సమీక్షకు న్యాయాధికారులు, కలెక్టర్, వీఎంసీ కమిషనర్ హాజరయ్యారు.

Vijayawada
police commissioner
Dwaraka Tirumala rao
  • Loading...

More Telugu News