Ward Volunteers: పట్టణ వార్డు వాలంటీర్ల పోస్టులకు 81 వేల మంది ఎంపిక

  • మొత్తం అందిన దరఖాస్తులు 1,68,993
  • 1,58,474 మందికి కాల్ లెటర్లు పంపిన అధికారులు
  • ఈ నెలాఖరులోగా నియామక ఉత్తర్వులు

పట్టణ వార్డు వాలంటీర్ల పోస్టులకు సుమారు 81వేల మంది ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పురపాలక శాఖ ఇంటర్వ్యూలు నేటితో ముగిశాయి. 110 పట్టణాల్లో వార్డు వాలంటీర్ పోస్టుల కోసం చేపట్టిన ఎంపిక ప్రక్రియకు మొత్తం 1,68,993 దరఖాస్తులు అందగా, వాటిలో 1,58,474 మంది దరఖాస్తుదారులను అర్హులుగా నిర్ణయించి అధికారులు కాల్ లెటర్లు పంపారు. వీరిలో నలుగురు మినహా మొత్తం ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఎంపికైన 81 వేల మందికి ఈ నెలాఖరులోగా నియామక ఉత్తర్వులు పంపించనున్నారు. ఆగస్టు మొదటి వారంలో వీరికి శిక్షణ ప్రారంభం కానుంది. ఆగస్టు 15 నుంచి వీరిని వార్డు వాలంటీర్ల వ్యవస్థలో నియమించనున్నారు.

Ward Volunteers
Towns
Interview
Call Letters
Andhra Pradesh
  • Loading...

More Telugu News