cm: సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్ గా చరిత్రలో నిలిచిపోతారు: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

  • జగన్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు
  • చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అవినీతే
  • లోకాయుక్త సవరణ బిల్లు, జ్యుడిషియల్ రివ్యూ బిల్లు తీసుకొచ్చారు

ఏపీ సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీలో లోకాయుక్త సవరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం బాగు కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, జగన్ ట్రెండ్ సెట్టర్ గా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అవినీతి కనిపించిందని ఆరోపించారు. అవినీతిని నిరోధించడానికి ఏపీలో లోకాయుక్త సవరణ బిల్లు, జ్యుడిషియల్ రివ్యూ బిల్లులను తీసుకువచ్చారని అన్నారు. లోకాయుక్తను బలపర్చడం ద్వారా మరింత మెరుగైన పరిపాలనను అందించవచ్చన్న ఉద్దేశంతో ఈ యాక్టు తీసుకువచ్చారని చెప్పారు.
 

cm
Jagan
mla
kapu
ramachandra reddy
  • Loading...

More Telugu News