Brazil: హాలీవుడ్ తరహా దొంగతనం.. పోలీస్ దుస్తుల్లో వచ్చి 750 కేజీల బంగారం, ఇతర లోహాలు ఎత్తుకెళ్లిన దొంగలు!

  • బ్రెజిల్ లోని పావోపాలో ఎయిర్ పోర్టులో ఘటన
  • తుపాకులతో చొరబడ్డ నకిలీ పోలీసులు
  • పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు  

హాలీవుడ్ యాక్షన్ సినిమాకు ఏమాత్రం తగ్గని ఘటన ఇది. ఓ విమానాశ్రయంలోకి పోలీసుల దుస్తుల్లో చొరబడ్డ దుండగులు ఏకంగా 750 కేజీల బంగారం, ఇతర విలువైన  లోహాలను ఎత్తుకెళ్లారు. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ లో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్ లోని సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయం చాలా రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులోకి ఓ ట్రక్కుతో కొందరు దుండగులు ప్రవేశించారు. వీరంతా పోలీస్ దుస్తుల్లో తుపాకులతో వచ్చారు.

విమానాశ్రయంలోకి చొరబడ్డ దొంగలు ఇద్దరు గార్డుల కణతలకు తుపాకీ గురిపెట్టారు. అనంతరం విమానం కార్గో పాయింట్ దగ్గరకు వెళ్లారు. అక్కడే 750 కేజీల విలువైన బంగారం, ఇతర విలువైన లోహాలను ట్రక్కులో నింపుకుని పరారయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీల్లో రికార్డయింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దోపిడీకి గురైన లోహాల విలువ రూ.276 కోట్ల వరకూ ఉంటుందని చెప్పారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపును చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Brazil
theft
airport
750 kg gold
robbery
  • Loading...

More Telugu News