Kurnool District: తల్లిదండ్రులు ఫోన్‌ కొనివ్వలేదని యువకుడి బలవన్మరణం

  • విషం తాగి యువకుడి ఆత్మహత్యా యత్నం
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
  • చికిత్స పొందుతూ మృతి

స్మార్ట్‌ ఫోన్‌ కొని ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదన్న క్షణికావేశంలో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చాడు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు సమీపంలోని నెల్లూరు అగ్రహారంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి.

 గ్రామానికి చెందిన ప్రదీప్‌ (21) కొన్ని రోజుల నుంచి స్మార్ట్‌ ఫోన్‌ కోసం మారాం చేస్తున్నాడు. కానీ తల్లిదండ్రులు దాన్ని పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన ప్రదీప్‌ విషం తాగేశాడు. గ్రామానికి దూరంగా ఉన్న తళి ప్రాంతంలో అతను అపస్మారక స్థితిలో పడివుండగా గ్రామస్థులు గమనించి అతన్ని హుటాహుటిన తొలుత హోసూరుకు, అనంతరం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.

Kurnool District
hosur mandal
Crime News
youth suicide
  • Loading...

More Telugu News