Andhra Pradesh: కేశినేనీ.. వెంటనే ఆ కుటుంబాలను ఆదుకో.. లేదంటే ...!: వైసీపీ నేత పీవీపీ

  • కేశినేని ట్రావెల్స్ లక్ష్యంగా విమర్శలు
  • ఆయన కంటే కసాయివాడే బెటరని వ్యాఖ్య
  • కార్మికులకు అన్యాయం చేసి అందలమెక్కారని ఆగ్రహం

టీడీపీ నేత కేశినేని నాని, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ)ల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. తాజాగా కేశినేని నాని ట్రావెల్స్ వ్యాపారం లక్ష్యంగా పీవీపీ విమర్శలు గుప్పించారు. కసాయివాడికి గొర్రె మీద ఉన్న ప్రేమ కూడా తన దగ్గర పనిచేస్తున్న కార్మికులపై కేశినేనికి లేదని పీవీపీ దుయ్యబట్టారు.

వేలాది మంది పొట్టకొట్టిన ఆయన ఈరోజు అందలమెక్కి కూర్చున్నారని విమర్శించారు. కడుపుకాలి, ఆ కడుపుమంటతో రోడ్డెక్కిన వేలాది కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే నీ బాస్ లాగా సంకనాకిపోతావని హెచ్చరించారు. ఈ మేరకు కేశినేని నాని ట్వీట్ చేశారు.

కొన్నేళ్ల క్రితం వరుస వివాదాలు చుట్టుముట్టడంతో కేశినేని ట్రావెల్స్ ను నిలిపివేస్తున్నట్లు నాని ప్రకటించారు. అప్పట్లో తమకు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వలేదని కొందరు కార్మికులు రోడ్డెక్కారు. తాజాగా ఆ విషయాన్నే పీవీపీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Andhra Pradesh
Telugudesam
YSRCP
Kesineni Nani
pvp
Twitter
  • Loading...

More Telugu News