Pradeep: ఉద్యోగాల పేరుతో కోట్లు దండుకున్న ముఠా

  • నిరుద్యోగులకు వల విసిరిన ముఠా
  • రూ.3 కోట్లు వసూలు చేసిన ముఠా సభ్యులు
  • భారీ సంఖ్యలో అపాయింట్‌మెంట్ లెటర్ల స్వాధీనం

నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని ఓ ముఠా తెలంగాణలో భారీ మోసానికి తెగబడింది. నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లతో నిరుద్యోగులకు వల విసిరింది. నిజమని నమ్మిన అమాయకులు సదరు ముఠాకు కోట్ల రూపాయల్లో సొమ్ము ముట్టజెప్పి చివరకు లబోదిబోమన్నారు. రైల్వే, బ్యాంకు, సింగరేణి ఉద్యోగాల పేరుతో సదరు ముఠా నిరుద్యోగుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసింది. మోసపోయిన వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రదీప్, ఆదిత్య అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.13 లక్షల నగదు, భారీ సంఖ్యలో అపాయింట్‌మెంట్ లెటర్లను స్వాధీనం చేసుకున్నారు.

Pradeep
Aditya
Railway
Bank
Singareni
Appointment letters
  • Loading...

More Telugu News