Flight: వేరే అమ్మాయివైపు చూస్తున్నాడని... విమానంలో భర్తను పరిగెత్తించి కొట్టిన భార్య... వైరల్ వీడియో!

  • మియామి నుంచి బయలుదేరిన దంపతులు
  • విమానంలో భర్త పాడు బుద్ధి
  • అడ్డొచ్చిన విమాన సిబ్బందిపైనా విసుర్లు

తన భర్త పాడుబుద్ధిని గమనించి, అందరిముందూ బుద్ధి చెప్పిందో ఇల్లాలు. అమెరికాలో ఓ విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, మియామీ నుంచి లాస్ ఏంజిల్స్ బయలుదేరిన విమానంలో మెక్ లెమోర్ అనే యువతి, తన భర్తతో కలిసి ప్రయాణించేందుకు వచ్చింది. విమానం టేకాఫ్ కు సిద్ధమవుతున్న సమయంలో భర్తకన్ను మరో అమ్మాయిపై పడటాన్ని ఆమె గమనించింది. దీన్ని తట్టుకోలేకపోయిన మెక్ లెమోర్, భర్తను తిడుతూ పైకి లేచింది. లగేజ్ క్యాబిన్ తెరిచి, అందులోని ల్యాప్ టాప్ ను తీసుకుని, అతని తలపై మోదింది. విమానంలో పరిగెత్తించి కొట్టింది. ఆమెను నిలువరించేందుకు విమాన సిబ్బంది ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ మొత్తం ఘటనను విమానంలోని మరో వ్యక్తి వీడియో తీయగా, అదిప్పుడు వైరల్ గా మారింది. విమానంలో గొడవ చేసినందుకు వారిద్దరినీ కిందకు దించేశామని అధికారులు తెలిపారు. విమాన సిబ్బందిని తిట్టినందుకు కేసును నమోదు చేశామని పేర్కొన్నారు.

Flight
Husbend
Another Girl
Laptop
Miyami
  • Error fetching data: Network response was not ok

More Telugu News