Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం-108 ఉద్యోగుల మధ్య చర్చలు విఫలం.. రేపు చలో విజయవాడ!

  • ఉద్యోగ భద్రత కల్పించాలంటున్న ఉద్యోగులు
  • ప్రభుత్వం నుంచి రాని స్పష్టమైన హామీ
  • నేటితో ఐదో రోజుకు చేరుకున్న ఆందోళన

ఏపీలో 108 ఉద్యోగులు, ప్రభుత్వ అధికారుల మధ్య ఈరోజు జరిగిన చర్చలు ఓ అంగీకారానికి రాకుండానే ముగిశాయి. పాత బకాయిలు చెల్లించడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ కు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. తమకు న్యాయం చేయాలని నేటికి ఐదు రోజులుగా 108 ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే రేపు ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తామని 108 ఉద్యోగులు ప్రకటించారు. తమ ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలనీ, లేదంటే సీఎం జగన్ తో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. విజయవాడలోని గాంధీనగర్ ధర్నాచౌక్ లో ఈరోజు నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటున్నామని ప్రకటించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News